దిగ్విజయ్ వ్యాఖ్యలపై అంబటి స్పందన
జగన్ తన కొడుకు లాంటి వాడంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జగన్ తన కుమారుడులాంటివాడన్న దిగ్విజయ్.. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఏం చేశారని మండిపడ్డారు . జగన్ పై కుట్రలు ఇన్ని రోజులూ కనిపించలేదా? అని ప్రశ్నించారు. దిగ్విజయ్ వ్యాఖ్యలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.